English | Telugu

‘అఖండ2’ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే.. బాలయ్య ప్రభంజనం సృష్టించడం ఖాయం!

- బాక్సాఫీస్‌ని టార్గెట్ చేసిన బాలకృష్ణ, బోయపాటి

- మధ్యప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు భారీ సాంగ్

- అఖండ2పై ఇండస్ట్రీలోనూ భారీ ఎక్స్‌పెక్టేషన్స్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు భారీ విజయాలు అందుకొని ఇద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రాలుగా నిలిచాయి. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లోనే రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టేందుకు అఖండ2 తాండవం చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

పవర్‌ఫుల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బాలకృష్ణ, బోయపాటి.. ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు అఖండ2 చిత్రంతో రాబోతున్నారు. డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ అయినా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.

Also Read:పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా.. అనఫీషియల్ న్యూస్‌లో అనేక మార్పులు

అఖండ2పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్‌ ఈ చిత్రాన్ని వారి అంచనాలకు మించే స్థాయిలో నిర్మిస్తున్నారు. అఖండ చిత్రంతో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి దానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ2తో మరోసారి బాక్సాఫీస్‌ను టార్గెట్‌ చేశారు బాలయ్య, బోయపాటి.

Also Read: మాస్ జాతర మూవీ రివ్యూ

ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటను ప్లాన్‌ చేశారు. ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌ నవంబర్‌ 3 నుంచి నాలుగు రోజులపాటు మధ్యప్రదేశ్‌లో జరగనుంది.

బాలకృష్ణ పోషిస్తున్న అఘోర పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను మహా కుంభమేళాలో చిత్రీకరించారు. ఆ తర్వాత లెక్కకు మించిన డాన్సర్లతో ఒక భారీ సాంగ్‌ను షూట్‌ చేశారు. ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్‌గానీ, గ్లింప్స్‌గానీ చూస్తే సినిమాలో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే భారీ ఎలిమెంట్స్‌ ఉన్నట్టు అర్థమవుతుంది. ఒక విభిన్నమైన కథతో, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read:బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!

ఈ సినిమాకి సంబంధించి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చర్చించుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని మరోసారి అఖండ2లో చూడబోతున్నామని యంగ్‌ హీరోలు సైతం ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెకండ్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టేందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.