English | Telugu

పుట్టినరోజున కమల్ విశ్వరూపం2

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన "విశ్వరూపం" చిత్రం అప్పట్లో చాలా ఇబ్బందులను ఎదుర్కున్నది. అయితే ఆ చిత్రానికి సీక్వెల్ గా "విశ్వరూపం-2" చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ట్రైలర్ ను కమల్ పుట్టినరోజు (నవంబర్ 7)న విడుదల చేయనున్నారు. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో, ఉన్నత స్థాయి టెక్నికల్ వర్క్ తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. మరి "విశ్వరూపం" చిత్రానికే ఆస్తులు పోగొట్టుకునే పరిస్తితి వరకు తెచ్చుకున్న కమల్, మరి ఈ చిత్రంతో ఎలాంటి పరిస్థితి తెచ్చుకుంటాడో త్వరలోనే తెలియనుంది.