English | Telugu
50 లక్షలతో తీస్తే.. ఇండస్ట్రీ హిట్ కొట్టింది!
Updated : Nov 20, 2025
ఆ సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు
విడుదలకు ముందు పెద్దగా సౌండ్ లేదు
కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్
మా సినిమాకి వందల కోట్ల బడ్జెట్ అయిందని గొప్పగా చెప్పుకునే రోజులివి. అలాంటిది అర కోటి బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కి, అది ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే?.. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. కానీ, ఈ అద్భుతం నిజంగా జరిగింది. రూ.50 లక్షలతో రూపొందిన ఓ సినిమా.. హిట్ అవ్వడం కాదు, ఏకంగా ఇండస్ట్రీగా హిట్ గా నిలిచింది. (Laalo – Krishna Sada Sahaayate)
ఆ సినిమా పేరు.. "లాలో – కృష్ణ సదా సహాయతే". ఇది గుజరాతీ డివోషనల్ డ్రామా ఫిల్మ్. రూ.50 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. ఈ ఏడాది అక్టోబర్ 10న పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో అడుగుపెట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ.. ఇప్పటిదాకా ఏకంగా రూ.60 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది.
గుజరాతీ సినిమా చరిత్రలో రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టిన మొదటి సినిమా 'లాలో' కావడం విశేషం. 2019లో విడుదలైన 'చాల్ జీవి లైయే'(Chaal Jeevi Laiye) రూ.50 కోట్లతో ఇప్పటిదాకా టాప్ గ్రాసర్ గా ఉండగా.. దానిని వెనక్కి నెట్టి 'లాలో' సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది.
Also Read:ఐబొమ్మ రవి అరెస్ట్.. తిమింగలాన్ని వదిలేసి చిన్న చేపను పట్టుకున్నారా..?
'లాలో' సినిమా కథ విషయానికొస్తే.. ఫార్మ్‌హౌస్ లో చిక్కుకున్న ఒక రిక్షా డ్రైవర్ ను శ్రీకృష్ణుడు ఎలా నడిపించాడు అనే కోణంలో నడుస్తుంది. జీవిత సత్యాన్ని బోధించేలా ఈ సినిమా ఉంటుంది. అందుకే ప్రేక్షకులు 'లాలో' చిత్రానికి అంతలా బ్రహ్మరథం పడుతున్నారు.
అంకిత్ సఖియా దర్శకత్వంలో మానిఫెస్ట్ ఫిలిమ్స్ నిర్మించిన 'లాలో' సినిమాలో కరణ్ జోషి, శ్రుహాద్ గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా ఇతర భాషల్లో విడుదలయ్యే అవకాశముంది.