English | Telugu
ఫేస్‌బుక్ బాహుబలి రాజమౌళి
Updated : Jun 24, 2014
టాలీవుడ్‌లో రాజమౌళికున్న ఇమేజ్ ప్రత్యేకం. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి గురించి కాకుండా మరో విషయం వలన టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారారు జెక్కన్న. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో రాజమౌళి చాలా పాపులర్. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తు, ఇంట్రస్టింగ్ ఫేస్‌బుక్ పేజ్ రన్ చేస్తున్న టాలీవుడ్ పర్స్‌నాలిటీ రాజమౌళి. తాను రూపొందించిన సినిమాలకు ప్రేక్షకులతో నూటికి నూరు శాతం మార్కులు వేయించుకునే ఈ మిస్టర్ పర్‌ఫెక్ట్ డైరెక్టర్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా 2 మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.
స్టార్ హీరోలకు, హీరోయిన్లకు ఇలా లక్షల్లో అభిమానులుండటం మాములే. కానీ దర్శకులలో 20 లక్షల మంది అభిమానులున్న దర్శకుడు మరెవరు లేరు. సినిమా ప్రమోషన్, మేకింగ్ లోనే కాదు అభిమానులను సంపాదించుకోవడంలో, వారితో రాపో మెయిన్‌టేయిన్ చేయడంలోను రాజమౌళి పర్‌ఫెక్ట్ అని అర్థమవుతోంది.