English | Telugu

కొన్నేళ్లపాటు కరోనాతో క‌లిసి జీవించాల్సిందే! డబ్ల్యూహెచ్‌ఓ!

కరోనాతో ఆఫ్రికాకు పెనుముప్పు పొంచివుంది. లక్షల మంది మృతి చెందే ప్రమాదమంటూ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చ‌రించింది. కరోనా క‌ట్ట‌డికి తగిన చర్యలు చేపట్టకపోతే ఆఫ్రికా ఖండానికి పెనుముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇదే పరిస్థితులు ఉంటే ఈ ఏడాది కాలంలో 2.9 కోట్ల నుంచి 4.4 కోట్ల మందికి వ్యాధి సోకే అవకాశం ఉందని, 1.9 లక్షల మంది మరణించే ప్రమాదం ఉందని హెచ్చ‌రించింది.

ఆఫ్రికా ఖండంలోని 47 దేశాల్లోని పరిస్థితులను పరిశీలించిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించకపోతే కొన్నేళ్లపాటు ఈ వ్యాధి ప్రజల జీవితంలో ఓ భాగంగా మారిపోతుందని హెచ్చరించింది.