English | Telugu
ముంబయి చేరుకోనున్న విదేశాల్లోని తెలుగు ప్రజలు! హోటళ్లలో 1000 గదులు సిద్ధం చేసిన ఏపీ సర్కార్
Updated : May 9, 2020
64 ప్రత్యేక విమానాల ద్వారా విదేశాల్లోని భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అందులో వున్న తెలుగువారిని ముంబయి నుంచి హైదరాబాద్, గన్నవరంకి తరలిస్తారు. ఈ క్రమంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారు సోమవారం నాటికి ప్రత్యేక విమానాల్లో ముంబయి చేరుకోనున్నారు. వారిని ముంబయి నుంచి హైదరాబాదుకు, గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు.