English | Telugu

ఆ మహిళ కరోనా తోనే మృతి చెందింది

గుంటూరు జిల్లా తాడేపల్లి మారుతి అపార్ట్మెంట్ లో మహిళకు కరోనా పాజిటివ్ సోకటంతో, ఆమె మరణించింది. ఇప్పటికే మరణించిన మహిళ మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా, రిపోర్ట్స్ లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మారుతి అపార్ట్మెంట్ రెండవ బ్లాకులో ఆమె నివాసం ఉన్న కారణంగా, అరకిలోమీటరు దూరం లో ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయం వరకూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఆ అపారట్మెంట్ చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు.