English | Telugu

ఆంధ్రప్రదేశ్‌ పై పంజా విసిరిన కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 603కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన 128 వ బులిటెన్‌ ప్రకారం, కృష్ణా జిల్లా లో 18 కేసులు, కర్నూల్ లో అత్యధికంగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల్లో 546 మంది చికిత్స పొందుతుండగా, కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 42 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 15 మంది మృతి చెందారు.