English | Telugu
జైల్లో టైం పాస్ చేయడంఎలా? డే టు డే షెడ్యూల్ వేసుకో సాయి!
Updated : Apr 12, 2020
పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు. అంటూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై నాగబాబు ఘాటుగా స్పందించారు.
దొంగ లెక్కలు వేసుకుని, దోచుకుంటూ బ్రతికేయకుండా నాతో ట్వీట్‌లేంటి? అంటూనే నాగబాబు చురకలంటించారు. ఫ్యూచర్‌లో జైల్లో ఎలా టైం పాస్ చెయ్యాలి అని ఒక డే టు డే షెడ్యూల్ వేసుకో టైం కలిసి వస్తుందంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
మాకు సినిమాలు, టీవీ షోలు చేయకుంటే కుటుంబాలు పోషించలేము. మీకు ఆ అవసరం లేదనుకోండి. మంది సొమ్ము బాగా మెక్కారు. ఇంకో వెయ్యేళ్ళు కాలు మీద కాలు వేసుకొని దొంగ లెక్కలు వేసుకుంటూ బ్రతుకుతారని మాకు తెలుసు. అవార్డ్స్ అందుకోగల పారిశ్రామిక వేత్తలని జైలు పాలు చేసింది తమరి ప్రతిభే కదా. చిన్న విషయం మీరు వైఎస్సార్ ఆడిటర్ కాకపోయి వుంటే శత కోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడాని వదిలేసి వాడిని వద్దు సాయి ఈ కరోనా టైంలో అంటూ నాగబాబు రెచ్చిపోయారు. దీనిపై విజయసాయి రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో ఏమిటో...