English | Telugu

సమావేశంలో స్పష్టత.. మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చెయ్యనున్న కేటీఆర్..

మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయటంతో పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ భవన్ లో మీటింగ్ జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటారు. అభ్యర్ధుల ఎంపిక.. మునిసిపాలిటీల్లో పార్టీ అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఈ మీటింగ్ లో చర్చిస్తారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మున్సిపాలిటీ లెవెల్ లో త్రీ మెన్ కమిటీని వేసే యోచనలో గులాబీ పార్టీ అధిష్టానం ఉ

న్నట్లుగా తెలుస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలకు ఇన్ చార్జిలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ఇంఛార్జులని నియమించారు. గతంలో ఇన్ చార్జిలు అందించిన నివేదికలపై పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. కార్పొరేషన్ లో కేటీఆర్ ప్రచారానికి సంబంధించి సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. రాజకీయంగా ఇబ్బందులు గ్రూపు తగాదాలు ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ఏం చేయాలో నేతలకు కేటీఆర్ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. టిక్కెట్లు రాని అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం తర్వాత పార్టీ ఇన్ చార్జిలు అప్పగించిన బాధ్యతలు నిర్వహించేందుకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్షేత్ర స్థాయిలో పని చేస్తారు.