English | Telugu
ఇంటి వైద్యంతో కరోనాను మట్టి కరిపించిన డాక్టర్!
Updated : Apr 13, 2020
స్కూలుకెళ్లిన పిల్లలను తీసుకొచ్చేందుకు బయటకెళ్లిన హేమకు బయటే వైరస్ సోకింది. అయితే స్వతహాగా వైద్యుడైన నిమ్మగడ్డ... రెండు రోజుల్లోనే తన సతీమణికి కరోనా సోకిందని నిర్ధారించేసుకున్నారు. అయితే కరోనా అంటేనే హడలిపోకుండా ఇంటిలోనే హేమకు చికిత్స మొదలెట్టేశారు.
ఈ క్రమంలో తనకూ వైరస్ సోకిందని నిమ్మగడ్డ గ్రహించారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పిల్లలిద్దరినీ ఓ గదిలో ఉంచేసిన నిమ్మగడ్డ... తను తన సతీమణి ఇద్దరూ కలిసి మరో గదిలో దాదాపు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఏమాత్రం బెదిరిపోని నిమ్మగడ్డ.. కరోనాపై పోరు ప్రారంభించేశారు.
కరోనా కారణంగా ఇద్దరికీ రోజూ జ్వరం వచ్చేది. అంతేకాకుండా దగ్గు కూడా వచ్చేది. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వేసుకోవడం స్టార్ట్ చేసిన నిమ్మగడ్డ... దగ్గు తగ్గేందుకు సిరప్ తాగేవారు. ఈ క్రమంలో కరోనా సోకిందన్న ఆందోళనను పక్కనపెట్టేసిన నిమ్మగడ్డ దంపతులు... పారాసిటమాల్ తో పాటు రోజూ ఉప్పు నీళ్లు వీలయినంత ఎక్కువ తాగడం - పసుపు - అల్లం - మిరియాల పొడి వేసిన నీటిని మరిగించుకుని తాగడం నిమ్మరసం తాగడం.. ఒంట్లో శక్తి తగ్గకుండా ఏదో ఒకటి తినడం... ఇలా కరోనాపై పోరు సాగించారు. చివరకు వారిద్దరి శరీరాల్లో నుంచి కరోనా పారిపోయింది.
ఈ క్రమంలో చిన్నపిల్లలైన తన ఇద్దరు కూతుళ్లు తమకు వంట చేసిపెట్టడం - తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకినా.. పేరెంట్స్ తో పాటు వారు కూడా నిబ్బరంగా ఉండటంతో.. ఆ కుటుంబం మొక్కవోని ధైర్యం ముందు కరోనా తల వంచేసింది.
ఇంటి వైద్యంతో కరోనాను మట్టి కరిపించి... వైరస్ ను తమ శరీరాల్లో నుంచి తరిమేశారు. గుండె నిబ్బరం కోల్పోకుండా పోరు సాగిస్తే.. కరోనా మహమ్మారి మనల్నేమీ చేయలేదని చెబుతున్న ఈ కుటుంబం విజయగాథ ఇప్పుడు యావత్తు ప్రపంచ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.