ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తాజా హెల్త్ బులెటిన్ వెల్లడించింది. ఏపి లో 420 కి కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా ఆదివారం 15 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 7, నెల్లూరు 4, కర్నూల్ 2,చిత్తూరు1,కడప1 పాజీటీవ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరొకరు కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారి సంఖ్య 7 కు చేరుకుంది. కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12 కాగా, ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 401 అని హెల్త్ బులెటిన్ పేర్కొంది.