English | Telugu
జోరుగా మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
Updated : Jan 25, 2020
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని కొత్తగూడెం ఇల్లందు మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.కొత్తగూడెం మున్సిపాలిటీలోని మొత్తం 36 డివిజన్ లకు సంబంధించి కౌంటింగ్ పద్దతిలో భాగంగా 36 టేబుల్స్ లను సిద్ధం చేశారు అధికారులు.ప్రతి టేబుల్స్ వద్ద 20 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్ గా కట్టకట్టి ప్రతి రౌండ్ లో 1000 ఓట్లను లెక్కిస్తారు. దాదాపు నలభై బండిల్స్ లెక్కించనున్నట్లు సమాచారం. 36 డివిజన్ లల్లో దాదాపు 35 డివిజన్లల్లో ఉన్న వార్డుల్లో 1000కి పైగా ఓట్లు ఉండడంతో ప్రతీ వార్డుకు సంబంధించి రెండు రౌండ్లలో ఫలితం వెలువడనున్నాయి.ఇల్లెందులో 24 వార్డులు ఉండగా 24 టేబుల్స్ లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతి రౌండ్ లో 1000 ఓట్లకు పైగా లెక్కించనున్నట్లు సమాచారం.మొత్తం మీద 2 గంటలలో ఫలితం వెలువడనున్నట్లు సమాచారం.మహబూబ్ నగర్ ఇలా పలు ప్రాంతాలల్లో ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలైన కారణంగా నేతలు ఏ పార్టీ విజయం సాధిస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.కాసేపట్లో వెలువడే ఫలితాలల్లో ఏ పార్టీ ఝండా ఎగురవేయనున్నందో వేచి చూడాలి.