English | Telugu

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత తదుపరి చర్యలకు సర్వం సిద్ధం...

తెలంగాణ అంతటా మున్సిపల్ ఎన్నికల కారణంగా గత కొద్ది రోజులుగా హడావిడి వాతావరణం నెలకొన్నది.మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అంకం పై ముందు గానే క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. ఈ నెల 27న నగర మేయర్ లు మున్సిపాలిటీ చైర్మన్ ల ఎన్నిక జరుగుతుందని ఆయన తెలియజేశారు. కరీంనగర్ మేయర్ ఎన్నికలు 29న జరుగనున్నదని ప్రతి మునిసిపాలిటీ కి బాధ్యుడిగా ఒక ప్రెసిడింగ్ అధికారిని కలెక్టర్ నియమించనున్నట్లు తన ఆధ్వర్యం లోనే మేయర్ లు చైర్మన్ ల ఎన్నిక జరుగుతుందన్నారు. మేయర్ చైర్మన్ ల ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు తమ విప్ లను నియమించుకోవచ్చునని,ఆ విప్ ఎవరన్నది రేపు ఉదయం 11 గంటలకు ఈసీకి తెలియ ఉంటుందని వెల్లడించారు.

ఆ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక మొదలవనున్నట్లు ఎవరైనా ముందు గానే మేం ఫలానా పార్టీ గానీ అభ్యర్థి గానీ ఓటేస్తామని చెబితే ఆ ఓటు చెల్లదని తెలియజేశారు.మేయర్ లు, చైర్ పర్సన్ ల ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల కూడా ఓటు హక్కు ఉంటుంది. ఎమ్మెల్యే పరిధి లో ఒక మున్సిపాలిటీ ఉంటే అక్కడ అతని ఎక్స్ అఫిషియోగా ఉంటారు. ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉంటే ముందు గానే ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పరోక్ష ఎన్నికల్లో ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్ధతి ద్వారా విజేతను ఎంపిక చేయనున్నది ఈసీ.మొత్తం మీద ఎన్నికల ఫలితాలు తరువాత ప్రణలికను కూడా ముందుగానే సిద్ధం చేశారు అధికారులు.