English | Telugu
సి.ఎం. కేసీఆర్‌గారు పేదల ఆకలి తీర్చండి!
Updated : Apr 12, 2020
తెలంగాణా ప్రజలు ఎవరి మాస్కులు వాళ్లే కొన్నారు, ఎవరి శానిటేషన్ వాళ్లే తెచ్చుకున్నారు, లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజుల సంపాదనలో మిగిలిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు, తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదికి వస్తే పోలీస్ లతో లాఠీ దెబ్బలు తింటున్నారు కానీ ప్రభుత్వం ప్రజలకు చేస్తుంది ఏంటి? శపార్ధాలు, పోలీస్ దెబ్బలు, ఇంట్లో నిర్బంధించడం తప్పుడు ప్రకటనలతో అయోమయం కలిగించడం మినహా ఇంకేముందని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
అధికారపార్టీ నేతలు మొహాలకు మాస్కులు కట్టుకొని రాజకీయాలు చేయడం మినహా ఎక్కడ ఎవరికి ఏ సహాయం చేయడం లేదు. మీకు తిట్టడం మినహా పాలన చేతకాదు అని మరోసారి రుజువైంది
ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పేదలను ఆదుకోకపోతే జనం తిరగబడతారని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది.
ఈరోజు దాకా ఆకలితో ఉన్న వాళ్లకోసం తెలంగాణా ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. లాక్ డౌన్ వేళా కోట్ల అప్పు తెస్తున్నారు, వందల కోట్ల ఫండ్ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగుల జితల్లో కోతలు ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రాన్ని మీరు ఎంత ల నాశనం చేశారో తెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమర్శించారు.
మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు అని సమేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరెక్ట్ గా సరిపోతుందని
కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 12 కిలోల బియ్యం మినహా ఈ నిమిషం దాకా ప్రజలకు ఎలాంటి సహాయం అందలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమర్శించారు.
పేదలు పని చేసుకోలేక పోతున్నారు, ఇంట్లో తినడానికి ఏమి లేదు, మీరు ఇవ్వరు మరి వాళ్ళు ఎలా బ్రతకాలి. వందల కోట్ల ఫండ్ వస్తుంది, జీతాలు కట్ చేశారు, మనది మిగులు బడ్జెట్ రాష్ట్రం మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి ఖర్చుపెడుతున్నారు శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.