English | Telugu

దేవ కట్టా కొత్త రాజకీయం!

దేవ కట్టా కొత్త రాజకీయం!

Publish Date:Jul 12, 2025

  నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇద్దరూ దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే చంద్రబాబు ముందే ముఖ్యమంత్రి కాగా, వైఎస్సార్ మాత్రం ఆలస్యంగా అయ్యారు. స్నేహితులు కంటే కూడా.. రాజకీయ ప్రత్యర్థులుగానే వీరు ఎక్కవ మందికి తెలుసు. అలాంటిది వీరి స్నేహం నేపథ్యంలో ఒక సిరీస్ కి శ్రీకారం చుట్టారు ప్రముఖ దర్శకుడు దేవ కట్టా. మయసభ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సిరీస్ టీజర్ తాజాగా విడుదలైంది.   ఇద్దరు మంచి స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులు ఎలా అయ్యారు అనే పాయింట్ తో మయసభ తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను ఆర్సీఆర్ గా చూపించారు. పార్టీలో ఆర్సీఆర్ భార్య సుశీల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ 160 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసినట్లుగా టీజర్ ప్రారంభమైంది. అదే సమయంలో రెడ్డికి నాయుడు ఫోన్ చేసి సలహా అడిగినట్లుగా చూపించడం ఆసక్తికరంగా ఉంది. "ఇది చావో రేవో అర్థంకావట్లేదు రెడ్డి. స్నేహితుడిగా ఒక మాట చెప్పు .. ఈ ఉచ్చు నుంచి బయటపడతాను అంటావా?" అని నాయుడు అడగగా.. "ఈరోజు నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణాన్ని నిన్ను ఓడించేవరకు వాడుతూనే ఉంటా" అని రెడ్డి చెప్తాడు. అలాగే "పిల్లనిచ్చిన మామతోనూ నీకోసం పోరాడుతున్నా" అని నాయుడు అనగా.. "ఫ్రెండ్ గా ఒక మాట చెప్పనా నాయుడు.. యుద్ధం నీ ధర్మం" అని రెడ్డి చెప్తాడు. రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో స్నేహితులిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్ళు అన్నట్టుగా టీజర్ చూపించారు. ఇక టీజర్ చివరిలో లారీలో వెళ్తున్న నాయుడు, రెడ్డి మధ్య జరిగే సంభాషణ బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. "అరక దున్నే కులంలో పుట్టినోడివి నీకెందుకు రాజకీయం" అని నాయుడిని రెడ్డి ఎగతాళి చేస్తాడు. దానికి కౌంటర్ అన్నట్టుగా "వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి.. నీకందుకు వైద్యం" అని నాయడు గట్టిగా నవ్వేస్తాడు. రెడ్డి కూడా నవ్వుతారు.   రాజకీయ నాయకుల గురించి సినిమా అంటే.. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చేసి చూపించడం జరుగుతుంటుంది. దాంతో విమర్శలు వస్తుంటాయి. అయితే మయసభ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. కాగా, ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.  
VISA Vintara Saradaga Teaser looks fresh and interesting

VISA Vintara Saradaga Teaser looks fresh and interesting

Publish Date:Jul 12, 2025

The teaser of VISA… Vintara Saradaga is now out and it hits all the right notes with its vibrant, relatable and quirky tone. Set in the USA, the film promises to be a rollercoaster of emotions as it explores the journeys of Telugu students who step into a new world chasing dreams only to find friendship, love, chaos and unexpected challenges. A unique highlight of the teaser is the hero’s hobby for podcasting, which becomes his personal outlet while navigating life abroad adding a refreshing, creative layer to the character and modern student experiences. Ashok Galla and Sri Gouri Priya headline this youthful entertainer and seem to be perfectly cast their chemistry adds charm and authenticity to the film’s emotional graph. Also featuring Rahul Vijay, Shivathmika Rajasekhar, and the ever-funny Harsha Chemudu, the cast comes together to reflect the lives of a generation navigating life away from home.   Marking the directorial debut of Udbhav Raghu, VISA brings a refreshing voice to Telugu cinema. His storytelling brings together romance, drama, and slice-of-life moments that feel rooted yet contemporary.The teaser is further elevated by a pulsating background score from music director Vijai Bulganin, offering a sneak peek into the musical heartbeat of the film’s world. With rich production values, picturesque visuals and a vibrant setting in the USA, the film promises a visually appealing and technically polished cinema experience. Film is produced by S Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, VISA promises to be a fun-filled new-age entertainer that connects with youth and families alike. Get ready to board this journey ~ VISA  is coming soon with full-on vibes!  

కీ బోర్డ్‌ ప్లేయర్‌ నుంచి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ వరకు మణిశర్మ జర్నీ ఇదే!

Publish Date:Jul 10, 2025

సినీ సంగీత ప్రపంచంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలందరికీ మ్యూజికల్‌ హిట్స్‌ అందించిన సంగీత దర్శకుడు మణిశర్మ. స్టార్‌ హీరోలకే కాదు వర్థమాన హీరోల సినిమాలకు కూడా అద్భుతమైన స్వరాలను సమకూర్చి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు మణిశర్మ. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో 200కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన ఆయన నేపథ్యం ఏమిటి, సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, మ్యూజికల్‌గా మణిశర్మ సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1964 జూలై 11న కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యశర్మ. సినీరంగంలోకి ప్రవేశించిన తర్వాత మణిశర్మగా తన పేరును మార్చుకున్నారు. తండ్రి నాగయజ్ఞశర్మ వయొలిన్‌ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలన్న ఉద్దేశంతో కుటుంబంతో సహా మద్రాస్‌ చేరుకున్నారు నాగయజ్ఞశర్మ. అలా మణిశర్మ అక్కడే పెరిగారు. అతనికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించి చిన్నతనంలోనే వయొలిన్‌, మాండొలిన్‌, గిటార్‌ నేర్పించారు తండ్రి. ఆ తర్వాతికాలంలో ఈ వాయిద్యాల కంటే కీబోర్డ్‌ ప్లేయర్‌కే ఎక్కువ ఆదాయం వస్తోందని గమనించిన నాగయజ్ఞశర్మ.. మణిశర్మకు కీబోర్డ్‌ కూడా నేర్పించారు. ఇళయరాజా, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి చాలా మందికి గురువైన జాకబ్‌జాన్‌ దగ్గర వెస్ట్రన్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నారు మణిశర్మ. అలాగే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. ఇంటర్‌ సెకండియర్‌లోనే చదువు ఆపేసి సంగీతాన్నే వృత్తిగా చేసుకున్నారు.  1982లో సంగీత దర్శకుడు సత్యం దగ్గర కీబోర్డ్‌ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు మణిశర్మ. ఆ తర్వాత ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్‌, కోటి, వందేమాతరం శ్రీనివాస్‌ వంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. ఎ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి కీబోర్డు సహాయకుడిగా వర్క్‌ చేశారు. కీరవాణి మొదటి సినిమా మనసు మమత నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాకీ మణిశర్మ పనిచేశారు. క్షణక్షణం సినిమాకి రీరికార్డింగ్‌ చేస్తున్న సమయంలో స్టూడియోకి వచ్చిన రామ్‌గోపాల్‌వర్మ.. మణిశర్మలోని టాలెంట్‌ను గుర్తించి తన దర్శకత్వంలో వచ్చిన ‘రాత్రి’ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే ఆ సినిమా కోసం ‘చలెక్కి ఉందనుకో..’ అనే పాటను కూడా రికార్డ్‌ చేయించారు. అయితే ఆ పాటను నాగార్జున హీరోగా వర్మ చేసిన ‘అంతం’ సినిమాకి ఉపయోగించారు. మణిశర్మ తొలిసారి స్వరకల్పన చేసిన పాట అదే.  1997లో ఏవీయస్‌ దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ‘సూపర్‌ హీరోస్‌’ చిత్రం ద్వారా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు మణిశర్మ. ఆ తర్వాత ప్రేమించుకుందాం రా చిత్రానికి మహేష్‌ మహదేవన్‌తో కలిసి సంగీతాన్ని అందించారు. చిరంజీవి హీరోగా జయంత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బావగారూ బాగున్నారా’ చిత్రం మణిశర్మకు సంగీత దర్శకుడుగా బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇక అక్కడి నుంచి చిరంజీవి సినిమాలకు వరసగా సంగీతాన్ని అందించారు. హీరో ఎవరైనా టాలీవుడ్‌లోని టాప్‌ డైరెక్టర్స్‌ అంతా మణిశర్మకే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవకాశాలు ఇచ్చేవారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌.. ఇలా అందరు హీరోల సినిమాలకు సంగీతం అందించారు మణిశర్మ. ఇతని సంగీతం చాలా వరకు ఫాస్ట్‌ బీట్‌తో, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. కానీ ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది. అందుకే మణిశర్మను మెలోడీ బ్రహ్మ అంటారు.  1997 నుంచి ఇప్పటివరకు బ్రేక్‌ అనేది లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు మణిశర్మ. ఇతర సంగీత దర్శకులు పనిచేసిన ఎన్నో సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. అలాగే చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌, మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్‌ సీజన్‌4కి థీమ్‌ మ్యూజిక్‌ చేశారు. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులుగా కొనసాగుతున్న థమన్‌, దేవిశ్రీప్రసాద్‌, హ్యారిస్‌ జైరాజ్‌ తొలిరోజుల్లో మణిశర్మ దగ్గర పనిచేశారు. ఇతని తనయుడు మహతి స్వర సాగర్‌ కూడా సంగీత కళాకారుడే. ఇప్పటికి 20 సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు.

రెట్టింపు నవ్వులు సర్దార్ కే ప్రమాదం కలిగించవచ్చు

Publish Date:Jul 12, 2025

దర్శక ధీరుడు 'రాజమౌళి'(SS Rajamouli)దర్శకత్వంలో సునీల్, సలోని జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ చిత్రం 'మర్యాద రామన్'(Maryadaramanna). 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ 2012 లో  హిందీలో అజయ్ దేవగన్(Ajay devgn)సంజయ్ దత్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో 'సన్ ఆఫ్ సర్దార్' గా తెరకెక్కి అక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుంది. మూవీలో జస్సి క్యారక్టర్ ని పోషించిన   అజయ్ దేవగన్ తో పాటు మిగతా వాళ్ళందరు తమదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత సన్ ఆఫ్ సర్దార్ కి సీక్వెల్ గా  'సన్ ఆఫ్ సర్దార్ 2 ' తెరకెక్కగా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్(Mrunalthakur)రవికిషన్, చుంకి పాండే, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలు పోషించారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సదరు ట్రైలర్ లో' జస్సీ తిరిగి వచ్చాడు. ఈ సారి రెట్టింపు వినోదం ఖాయం. కానీ ఇందులోని నవ్వులు, గందరగోళం సర్దార్ కే ప్రమాదం కలిగించవచ్చు. సర్దార్ ఎవరికైనా అండగా నిలిస్తే వారి వైపు ఎవరు తొంగి కూడా చూడరు. సర్దార్ మనకి సన్నీడియోల్ నటించిన బోర్డర్ మూవీ కథ చెప్తున్నాడనే లాంటి సంభాషణలతో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పింది. ఈ సందర్భంగా వచ్చిన సన్నివేశాలు కూడా నవ్వులు పూయించడంతో పాటు కథపై కూడా అందరిలో ఆసక్తిని కలగచేస్తుంది.  జియో స్టూడియోతో కలిసి అజయ్ దేవగన్ నిర్మించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2 'కి  విజయ్ కుమార్ అరోరా(Vijaykumar Arora)దర్శకత్వం వహించాడు.  అజయ్ దేవగన్ ఇటీవల తెలంగాణ(Telangana)ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిసి హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.      

సుధీర్, గెటప్ శీను లేకుండా ఒక్కడినే స్టేజి ఎక్కినప్పుడు గుండె ఆగిపోయిన్నట్టుగా ఉంది

Publish Date:Jul 12, 2025

సర్కార్ సీజన్ 5 ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఎందుకు అంటే ఈ వీక్ ఎపిసోడ్ కి వచ్చింది జబర్దస్త్ టీమ్. అంటే సుధీర్ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ. వీళ్లందరి అల్లరి మాములుగా లేదు. కింద పడి దొర్లి దొర్లి జోక్స్ వేసుకున్నారు. ఇక సుధీర్ ఐతే ఒక టైంలో వాళ్ళ వాళ్ళ లైఫ్ లో స్పైసీ ఇన్సిడెంట్స్ చెప్పమని అడిగేసరికి..రాంప్రసాద్ చెప్తూ ఏడ్చినంత పని చేసాడు. "సీరియస్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏడ్చింది లేదు. ఒక్కసారి నేను మీ ఇద్దరూ లేకుండా ఒక షో కోసం స్టేజి ఎక్కా..కుడి భుజం, ఎడం భుజం లేకుండా అంటారు కదా అలా కూడా కాదు. నాకు మెదడు, గుండె పని చేయనంతలా ఐపోయింది. అదే ఫస్ట్ టైం నేను మీ ఇద్దరూ లేకుండా ఆ పరిస్థితిని ఫేస్ చేశా గట్టిగా. మేకప్ వేసుకునే అద్దం ముందుకెళ్లి ఏంటి కొత్తగా ఉంది నిజంగా ఏదో పవర్ నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. తొమ్మిదిన్నరేళ్ళు కలిసి పని చేసాం. కానీ ఒక్కసారి నేను ఒక్కడినే స్టేజి మీదకు వెళ్లేసరికి తెలియని ఒక భయం వచ్చేసింది. అఫ్కోర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చింది నా గురించి నేను బతకడానికి కూడా కాబట్టి ఆ విషయాన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఎక్కడికి పోతారు బయటకు వెళ్లి కలుస్తాను...అప్పుడే మీరు లేనప్పుడే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అదే నా లైఫ్ లో బాధపడిన విషయం" అన్నాడు రాంప్రసాద్. అవును ..మేము కూడా నిన్ను చాలా మిస్సయ్యాం..అలాగే ఆ స్టేజిని కూడా మిస్సయ్యాం అని చెప్పాడు సుధీర్.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

తాత పాత్రలో అల్లు అర్జున్!

Publish Date:Jul 12, 2025

  2003లో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఈ 22 ఏళ్లలో 21 సినిమాలు చేశాడు. అందులో ఒక్క సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చేయలేదు. అలాంటిది తన నెక్స్ట్ మూవీలో ఏకంగా నాలుగు పాత్రలు చేయనున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది.   అల్లు అర్జున్ తన 22వ సినిమాని అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో బన్నీ నాలుగు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. తాత, తండ్రి, ఇద్దరు కుమారుల పాత్రలలో అల్లు అర్జున్ సందడి చేయనున్నాడని సమాచారం. ఇంతవరకు ద్విపాత్రాభినయమే చేయని బన్నీ.. ఇప్పుడు అట్లీ సినిమాలో ఏకంగా నాలుగు క్యారెక్టర్స్ చేస్తున్నాడనే న్యూస్ ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.   కాగా, ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే పేర్లు లాక్ అయినట్లు సమాచారం. అల్లు అర్జున్ నాలుగు పాత్రలు చేయనుండటం, ఐదుగురు హీరోయిన్లు ఉండటం చూస్తుంటే.. అట్లీ ఏం ప్లాన్ చేశాడా అనే ఆసక్తి కలుగుతోంది.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

తమ్ముడు

Publish Date:Jul 4, 2025

కన్నప్ప

Publish Date:Jun 27, 2025

కుబేర

Publish Date:Jun 20, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025

Thammudu

Publish Date:Jul 4, 2025

Uppu Kappurambu

Publish Date:Jul 4, 2025

Kannappa

Publish Date:Jun 27, 2025

Kuberaa

Publish Date:Jun 20, 2025