English | Telugu
త్వరలో కరోనా సహజ స్వభావాన్ని కోల్పోతుంది!
Updated : Apr 17, 2020
కరోనా వైరస్ గురించి నైరాశ్యం వద్దు. మన దేశం ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను చూసిందని స్వామీజీ అన్నారు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని స్వరూపానందేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో దాని ప్రభావం తగ్గుతుందని స్వామీ చెప్పారు.
విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని...కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామని స్వామి తెలిపారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే ప్రజల్ని కాపాడుతోంది. అదే రక్షణ. లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచండి అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు.