English | Telugu
మోదీకే ఎదురెళ్తున్న కేసీఆర్!
Updated : Apr 17, 2020
ఇప్పటికే భారత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా క్షీణించిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 వ తేదీన లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలిస్తున్నామంటూ మార్గదర్శకాలను జారీచేసింది.
ఇప్పటికే అత్యవసర సేవల కు మొదటి నుండి లాక్ డౌన్ కు మినహాయింపులు ఇవ్వగా ఇప్పుడు దీనికి తోడుగా మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు కొందరిలో హర్షం వ్యక్తం చేశాయి . అయితే ఈ నెల 20 నుండి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా రుచించలేదు.
అయితే ప్రధాని మోడీ తో సంబంధం లేకుండా తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాలు వచ్చే నెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఆ తరువాత ప్రధాని మే 3 వరకు ప్రకటించిన విషయం తెలిసిందే.