English | Telugu

లిక్కర్ కోసం వేల‌మంది? శ‌వ‌యాత్ర‌కైతే 20 మందే! మోదీ నిబంధ‌న‌పై శివ‌సేన ట్వీట్‌!

లాక్‌డౌన్ నిబంధనల సడలింపులపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్ర‌ ప్ర‌భుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శవయాత్రలో పాల్గొన‌డానికి అయితే కేవలం 20 మందికి అనుమతి ఇచ్చి, మద్యం షాపుల ఎదుట మాత్రం వేల మందికి అనుమతి ఇవ్వడంపై తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

శవ యాత్రలో 20 మందిని మాత్రమే అనుమతించారు, ఎందుకంటే ఆత్మ(స్పిరిట్‌) అప్పటికే శరీరాన్ని వదిలి వెళ్లి ఉంటుంది. అదే మద్యం షాపుల ముందు మాత్రం వేలాది మందికి అనుమతిచ్చారు. ఎందుకంటే మద్యం షాపుల్లోనే స్పిరిట్‌ ఉంటుంది కాబట్టి అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.