English | Telugu

తండ్రీ కొడుకుల్ని వ్యాన్‌లో పంపండి! విజయసాయిరెడ్డి ట్వీట్‌!

హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు , ఆయన కుమారుడు లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

'పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి. విమానంలోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్‌. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా?' అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.