English | Telugu
90 శాతం బెజవాడ రెడ్ జోన్ గా నిర్ధారణ
Updated : Apr 18, 2020
వీఎంసీ చికెన్, మటన్, చేపల మార్కెట్లను రేపు తెరవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. సోషల్ డిస్టన్స్ సందుల్లో, చిన్న చిన్న రోడ్లలో పాటించటం లేదని గుర్తించినట్టు ఆయన చెప్పారు. డ్రోన్ల ద్వారా ఈ ప్రాంతాల్లో పబ్లిక్ తీరును అధికారులు పరిశీలిస్తారని కలెక్టర్ చెప్పారు. మరిన్ని ఆటోల ద్వారా లాక్ డౌన్ నిబంధనలు, కరోనా పై ప్రచారం చేస్తున్నామన్నారు. బెజవాడ లో 17 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని, 90 శాతం బెజవాడను రెడ్ జోన్ గా నిర్ధారణ చేశామని కలెక్టర్ వివరించారు.