English | Telugu
అమెరికాలో ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయడానికి అనుమతి!
Updated : Apr 21, 2020
పాత నిబంధనల్ని సడలిస్తూ అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పలు కొత్త సూచనలతో తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఆన్ క్యాంపస్ ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిప్పుడు ఆఫ్ క్యాంపస్ లో ఉద్యోగం చేసుకునేందుకు అప్లై చేసుకోవచ్చన్న వెసులుబాటు ఇచ్చారు. అయితే.. ఇందుకు కొన్నినిబంధనల్ని పాటించాలని పేర్కొన్నారు. ఆఫ్ క్యాంపస్ లో ఉద్యోగం చేయటం కోసం.. వర్సిటీ నుంచి అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. తాజా వెసులుబాటు తీసుకునే వారు కోర్సు పూర్తయ్యే కాలంలో ఏడాది పాటు ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయొచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికాలో చిక్కుకున్న విదేశీ విద్యార్థులకు పెద్ద ఎత్తున మేలు చేస్తుందని చెబుతున్నారు.