English | Telugu

కప్పలను తిని ఆక‌లి తీర్చుకుంటున్నారు!

లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు. ఈ హృదయ విదారక ఘటన బీహార్ లో వెలుగులోకి వ‌చ్చింది.

ఐదురోజులుగా తిండి లేకపోవడంతో జెహనాబాద్ కు చెందిన కొందరు చిన్నారులు ఆకలితో అలమటిస్తూ వీరే దారి లేక దొరికిన‌ కప్పలను తింటూ కడుపు నింపుకుంటున్నారు. అందుకోసం గుంతల్లో, మురికి కాలువలో ఉన్న కప్పలను వేటాడి చంపి, వాటిని ఆహారంగా తింటున్నారు. ఇంట్లో వండుకోని తిన‌డానికి ఏమీ లేదు. గ‌త్యంత‌రం లేక‌నే ఇలా చేస్తున్నామ‌ని ఆ చిన్నారులు చెబుతూ కంట‌త‌డి పెట్టారు. ఈ సంఘ‌ట‌న‌పై జిల్లా మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ ఘటనపై విచారణకు ఆదేశించారు.

పాల‌కుల దివాళాకోరు త‌నానికి పేద‌లు ఎలా బ్ర‌తుకుతున్నారో ఈ సంఘ‌ట‌న అద్దం ప‌డుతోంది. కేవ‌లం మాట‌ల‌గార‌డీతో జ‌నాల మ‌ధ్య చిచ్చు పెడుతూ త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునే నేత‌లున్నంత కాలం ఇలాంటి మ‌రెన్నో దౌర్భ‌గ్య ప‌రిస్థితుల‌ను ఎదురుకోవ‌డానికి సిద్ధంగా వుండాలి మరి.