English | Telugu
కేబీఆర్ పార్క్ దగ్గర చిరుతపులి సంచారం!
Updated : Apr 21, 2020
లాక్ డౌన్ వలన ప్రజలందరు ఇళ్లకి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వన్య ప్రాణులు రోడ్లపైకి వచ్చి యదేచ్ఛగా తిరుగుతున్నాయి. అయితే వాకర్స్‌తో నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ కూడా ఇప్పుడు మూతపడడంతో ఆ పరిసర ప్రాంతంలో చిరుతపులి ఒకటి సంచరించడం చుట్టు పక్కల ప్రజలని భయబ్రాంతులకి గురి చేస్తుంది.
హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు హిల్స్ కు సమీపంలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లోకి చిరుతలు తరచూ వస్తున్నాయి. గతంలోనూ కూకట్ పల్లి ప్రగతినగర్ లో చిరుత కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కూకట్ పల్లిలో ప్రగతినగర్ గాజుల రామారం మధ్య చిరుత కనిపించింది. దీంతో సమీపంలోని పలు ప్రాంతాల ప్రజలు అప్పట్లో హడలిపోయారు. చిరుత తిరుగుతున్న దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.