English | Telugu

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ.. అసలు ఉద్దేశం అదే!

ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం ప్యాకేజీకి రూపకల్పన చేశామని తెలిపారు. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఉత్పత్తులకు పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. దేశాన్ని అన్ని రకాలుగా పునరుత్తేజం చేసేందుకే ఈ ప్యాకేజీని రూపొందించినట్లు చెప్పారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఐదు సూత్రాలతో ఈ ప్యాకేజీని రూపొందించామని.. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలని నిర్మలా ప్రకటించారు.