English | Telugu
కరోనా పాజిటివ్ వచ్చినా ఇంటికి పంపించారు.. నన్ను కాపాడండి!
Updated : May 13, 2020
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన వ్యక్తి చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో పని చేస్తున్నాడు. అతను కరోనా లక్షణాలతో మే 5న స్థానిక ఆసుపత్రిలో చేరగా.. 8న పాజిటివ్ అని తేలింది. అయితే రెండ్రోజుల చికిత్స అనంతరం 10న అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో ఆ బాధితుడు.. తనకు పాజిటివ్ వచ్చినప్పటికీ ఇంటికి పంపారని.. ప్రభుత్వం తనని కాపాడాలని కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తీవ్ర అనారోగ్యంతో ఒంటరిగా బాధపడుతున్నానని, తాను బయట తిరిగితే తన ద్వారా మిగతావారికి వైరస్ సోకే ప్రమాదం ఉందని.. కావున తనకు చికిత్స అందించాలని, ఏపీ అధికారులు తనను రక్షించాలని వీడియోలో విజ్ఞప్తి చేశాడు.