English | Telugu
గ్యారంటీ లేకుండా ఎంఎస్ఎంఈలకు 3 లక్షల కోట్ల రుణం!
Updated : May 13, 2020
ఎంఎస్ఎంఈల నిర్వచనం కూడా మారుస్తున్నామని ఆమె తెలిపారు. దీంతో వారి పరిమాణం పెరుగుతుందని, ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని పెంచామని తెలిపారు. అలాగే టర్నోవర్ పరిమితిని కూడా పెంచామని వివరించారు. ఈ-మార్కెట్‌ప్లేస్, సప్లై చెయిన్ మెరుగుపరచడం, ఇన్వెస్ట్‌మెంట్లు సహా పలు కీలక చర్యలు తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
2020 జూలై 31 నుంచి 2020 నవంబర్ 30కు ఎక్స్‌టెండ్ చేశారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. అలాగే టీడీఎస్, టీసీఎస్ రేట్లను 25 శాతం తగ్గించారు. నాన్ శాలరీడ్ పేమెంట్స్‌కు ఇది వర్తిస్తుంది. 2021 మార్చి 31 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. దీంతో వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు రానున్నాయి.
పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగుల టేకోమ్ శాలరీ పెరుగుతుంది. దీంతో చేతిలో కొంత ఎక్కువ డబ్బులు మిగులుతాయి. వచ్చే మూడు నెలలు ఇది వర్తిస్తుందని తెలిపారు. కంపెనీలు మాత్రం 12 శాతం పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూట్ చేస్తాయని పేర్కొన్నారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని మరో మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఇది వర్తిస్తుంది. కంపెనీలు, ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కేంద్ర ప్రభుత్వమే ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తుంది. రూ.15000 లోపు వేతనం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.
లాక్ డౌన్ కారణంగా కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఎకనామిక్ ప్యాకేజీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుధీర్ఘ వివరణ ఇచ్చారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు తెలిపారు. 50 వేల కోట్లతో ఎంఎస్ఎంఈ లకు నిధి ఏర్పాటు. ఈ రోజు నుంచి ప్యాకేజీ వివరాల్ని ఒక్కొక్కటిగా ప్రకటిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.
ఆత్మనిర్భర భారత్ మిషన్‌కు ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగం, వ్యవస్థ, డెమోగ్రఫీ, డిమాండ్.. ఈ అయిదూ మూలస్తంభాలని, వాటిని బలోపేతం చేయడానికి ఈ ప్యాకేజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమ, MSMEలు, కార్మికులు, రైతులు, మధ్య తరగతి పన్ను చెల్లింపు దారులు, భారతీయ పరిశ్రమల్లోని వివిధ విభాగాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక ప్యాకేజీని రూపొందించాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగపడేలా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం.
నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ డిమాండ్ కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.