English | Telugu
కువైట్ క్షమాభిక్షతో లాభపడనున్న 40 వేల మంది భారతీయులు!
Updated : Apr 17, 2020
ఎలాంటి జరీమానాలూ లేకుండా దేశం విడిచి వెళ్ళేందుకు వీలుగా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్షను ప్రకటించింది. అయితే కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను దక్కించుకునేందుకు పెద్దయెత్తున భారతీయులు లైన్లలో నిలబడ్డారు. ఫర్వానియా మరయు జిలీబ్ ప్రాంతాల్లో రెండు క్షమాభిక్ష కేంద్రాల్ని భారతీయుల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 20 వరకు క్షమాభిక్ష అభ్యర్థనల్ని ఈ సెంటర్స్ స్వీకరిస్తాయి. ఉదయం 8 గంటల నంచి 2 గంటల వరకు ఇందుకు అనుమతినిస్తున్నారు.
పురుషులు:
1. ఫర్వానియా గవర్నరేట్ - ఫర్వానియా ప్రైమరీ స్కూల్ - గర్ల్స్, బ్లాక్ 1, స్ట్రీట్ 76
2. జిలీబ్ అల్ షుయోఖ్, నయీమ్ బిన్ మసౌద్ స్కూల్ - బాయ్స్, బ్లాక్ 4, స్ట్రీట్ 250
మహిళలు:
1. ఫర్వానియా గవర్నరేట్ - అల్ ముథాన్నా ప్రైమరీ స్కూల్ - బాయ్స్, బ్లాక్ 1, స్ట్రీట్ 122
2. జిలీబ్ అల్ షుయోక్, రుఫైదా అల్ అస్లామియా - గర్ల్స్, బ్లాక్ 4, స్ట్రీట్ 200
చెల్లుబాటయ్యే పాస్‌పోర్టులు వున్న భారతీయులు, ఆయా కేంద్రాల్ని బ్యాగేజ్‌తో సందర్శించాల్సి వుంటుంది. అక్కడ ఏర్పాటు చేసే షెల్టర్స్‌లో తదుపరి ఇన్‌స్ట్రక్షన్స్ వరకు వుండేందుకు వీలుగా వెళ్ళాల్సి వుంటుందని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. వాలీడ్ డాక్యుమెంట్స్ లేనివారు (మహిళలు, పురుషులు), ఫర్వానియా ప్రైమరీ స్కూల్ - గర్ల్స్, బ్లాక్ 1, స్ట్రీట్ 76 వద్ద కేంద్రాన్ని సందర్శించాల్సి వుంటుంది బయో మెట్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం. ఇలాంటివారు ఎలాంటి బ్యాగేజీ తీసుకురావాల్సిన అవసరం వుండదు. వారికి ప్రస్తుతం అక్కడ ఎలాంటి షెల్టర్ ఏర్పాటు చేయరు. వాలంటీర్ల ద్వారా ఇసి కోసం దరఖాస్తు చేసుకున్నవారు పై కేంద్రాల్ని సందర్శించాల్సిన అవసరం లేదు. ఇసి పూర్తయ్యాక, దరఖాస్తుదారుల్ని సంబంధిత వాలంటీర్లే సంప్రదిస్తారు.
జనరల్‌గా గల్ఫ్ దేశాల్లో ప్రత్యేక పరిస్థితుల్లోనే క్షమాభిక్ష ప్రకటిస్తారు. సడన్‌గా కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంది తెలుగువాళ్ళల్లో ఆంధ్రకు చెందిన వారే కువైట్‌లో ఎక్కువగా వున్నాట్లు తెలుగుసంఘాలు తెలుపుతున్నారు.