English | Telugu

జగన్ సమక్షంలో కియా కీలక ప్రకటన.. ఏపీలో భారీ పెట్టుబడులు

దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా మోటార్స్ ప్రకటించింది. 'మన పాలన - మీ సూచన' కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ పారిశ్రామిక రంగంపై ఈరోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కియా సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ సమక్షంలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని తెలిపారు. కియా ఎస్‌యూవీ వెహికల్స్‌ తయారీకి కొత్తగా పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు. ఏపీతో కియా మోటార్స్ కు బలమైన బంధం ఉందని కూకున్ చెప్పారు.