English | Telugu
వలస కార్మికుల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Updated : May 28, 2020
వలస కూలీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా వారు తమ గమ్యస్థానాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ముఖ్యంగా కాలి నడకన వెళ్తున్న వలస కార్మికులకు తక్షణమే సాయం అందించాలని సూచించింది. వలస కార్మికులు పడుతున్న కష్టం చూసి గుండె తరుక్కుపోతోందని తెలిపింది. వలస కార్మికుల విషయంలో అనేక లోటుపాట్లను తాము గుర్తించామని.. రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు ఆహారం మంచినీళ్లు అందించే ఏర్పాట్లలో లోపాలు గుర్తించామని తెలిపింది. వారిని వారి స్వస్థలాలకు తరలించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి కార్మికుడూ క్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని సుప్రీంకోర్టు కోరింది.