English | Telugu

విశాఖ ఘటనపై స్పందించిన హైకోర్టు! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఏపీ హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. గ్యాస్ లీకై పలువురు మృత్యవాతపడిన దుర్ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకుని గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై విచారణ జరిపింది. అధిక జనాభా ఉన్న ప్రాంతంలో ఇటువంటి పరిశ్రమ ఎలా ఉందని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది.