English | Telugu

ఏపీ‌ ప్ర‌భుత్వానికి మానవహక్కుల కమిషన్ నోటీస్ జారీ!

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘ‌ట‌న‌ నేపధ్యంలో రాష్ట్రానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. గ్యాస్ లీకేజీ ఘటన విషయమై సమాధానాలనివ్వాలని కమిషన్ తన నోటీసుల్లో ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.

గ్యాస్ లీకేజీ సంఘటనను, తర్వాతి పరిణామాలను మీడియా ద్వారా తెలుసుకుంటున్న జాతీయ మానవహక్కుల కమిషన్... ఆయా అంశాలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. గ్యాస్ లీకేజీ అనంతరం... తీసుకున్న సహాయక చర్యలను కూడా వివరించాలని ఆదేశించింది.