English | Telugu
మైసూరు వైద్యురాలికి అమెరికాలో అపూర్వ గౌరవం
Updated : Apr 21, 2020
* పాశ్చాత్యులు త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరిస్తున్న 'వైద్యో నారాయణో హరి' సూత్రం
ఇది ఒక అపురూప ఘట్టం. ఒక అనిర్వచనీయమైన అనుభూతి .... భారత సంతతికి చెందిన డాక్టర్ ఉమా మధుసూదన , యు ఎస్ ఏ లోని సౌత్ విండ్సర్ హాస్పిటల్ లో కరోనా పేషంట్స్ ను ట్రీట్ చేసినందుకు గాను, అక్కడి పోలీసు యంత్రాంగం, పౌర సమాజం ఆమెకు ఇచ్చిన అద్భుతమైన గౌరవం. మైసూర్ కు చెందిన డాక్టర్ ఉమా మధుసూదన వెలకట్టలేని సేవలు అందించారని, అందుకు కృతజ్ఞతా పూర్వకంగా ఆమె ఇంటి ముందుకు సైరన్ వాహనాలతో వచ్చి మరీ వారి ధన్యవాదాలను ఆమెకు తెలియచేశారు. డాక్టర్ ఉమా మధుసూదన కూడా వారు ఇచ్చిన ప్రేమపూర్వక గౌరవవందనాన్ని సంతోషంగా స్వీకరించారు. వైద్యో నారాయణో హరి అన్న మన సూత్రాన్ని, పాశ్చాత్యులు త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపించారు. మరి, మన పౌర సమాజాలు హైదరాబాద్ లోనూ, దేశం లోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా మీద డాక్టర్ల మీద జరుపుతున్న దాడులు చూస్తుంటే, మనం ఎక్కడున్నామో, మనం ఏమి చేస్తున్నామో , మనలో ఏమి ఎలిమెంట్ మిస్ అయిందో తెలుస్తుంది. కనీసం ఈ అపురూప దృశ్యం చూసైనా మనలోని అనాగరికులకు బుద్ధి వస్తుందని ఆశిద్దాం.