రాష్ట్రపతి భవన్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టించింది. రాష్ట్రపతి భవన్ లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్థారణ అయింది. క్వాటర్స్ లో నివసిస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది బంధువు ద్వారా కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో 125 కుటంటంబాలను రాష్ట్రపతి భవన్ అధికారులు సెల్ఫ్ ఐసోలేషన్ కు పంపించారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. హౌస్ క్లీనింగ్ స్టాఫ్ ను క్వార్టర్స్ కే పరిమితం చేశామని అధికారులు తెలిపారు.
భారత రాష్ట్రపతి కొలువుంటే రాష్ట్రపతి భవన్ కు కరోనా వైరస్ పాకడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రపతికి ఏమైంది అని అందరూ ఆరాతీయడం మొదలు పెట్టారు. ఈ హఠాత్ పరిణామానికి రాష్ట్రపతి భవన సముదాయంలో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ లోని మొత్తం కుటుంబాలను తదుపరి నోటీసులు వచ్చే వరకు ఐసోలేషన్ లో ఉంచారు. రాష్ట్రపతికి ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమీ లేదని.. కరోనా పాజిటివ్ వ్యక్తులు రాష్ట్రపతికి సన్నిహితంగా లేరని తెలిసింది.