English | Telugu

వేడితో పాటు క‌రోనా సెగ కూడా పెరుగుతుంది!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కోవిడ్‌పై ప్రభావం చూప‌డం లేదు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా రూపాంతరం చెంది మ‌రింత బ‌ల‌ప‌డుతోందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కోవిడ్‌కు.. ఉష్ణోగ్రతలకు అసలు సంబంధమే లేదు. మ్యూటేటెడ్‌ వైరస్‌ అయిన కరోనా ఎలాంటి కాలంలోనైనా తట్టుకుని బతికే అవకాశాలున్నాయని కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఎండలు తీవ్రమైన కొద్దీ వైరస్‌ తన శక్తిని కోల్పోతుందనే విశ్లేష‌ణ స‌రైన‌ది కాద‌ని, రానున్న కొద్దిరోజులు ప్రజలు మరింత అప్రమత్తంగాఉండాలని ఆయన హెచ్చ‌రించారు. రాష్ట్రంలో మరో రెండువారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగించ‌డం చాలా అవ‌స‌ర‌మేని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణలో వైరస్‌ థర్డ్‌స్టేజీకి చేరలేదన్నారు. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ చైన్ లింక్‌ను విజయవంతంగా విడగొట్టామన్నారు.