English | Telugu
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనక రాజు
Updated : Apr 11, 2020
శుక్రవారం ఆన్‌లైన్‌లో రాష్ట్ర మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించి.. ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర పొందింది. ఆ వెంటనే దీనిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపింది. గవర్నర్ కూడా దీనిని ఆమోదించారు. ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోద ముద్ర పడగానే.. చకచకా మూడు జీవోలు వెలువడ్డాయి. పంచాయతీరాజ్
శాఖ, న్యాయశాఖల్లో గ్రామీణ ఎన్నికలకు సంబంధించి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్డినెన్స్‌ను అమలులోకి తెస్తూ ఒక జీవో జారీ చేశారు. ఆ తర్వాత... ఆర్డినెన్స్‌కు అనుగుణంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ జీవో నెంబరు 617 జారీ చేయడం జరిగింది