English | Telugu
షుగర్ పరీక్ష చేసినట్లుగా ర్యాపిడ్ టెస్టు చేస్తారా? కేంద్రం చురక!
Updated : Apr 18, 2020
అయితే ర్యాపిడ్ టెస్టుల మార్గదర్శకాలు మాత్రం వేరేగా ఉన్నాయి. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే.. నెగెటివ్‌గా నిర్ధారించలేమని కేంద్రం తేల్చి చెబుతోంది. కరోనా ర్యాపిడ్ టెస్టుల ద్వారా…వైరస్ పాజిటివ్ లేదా నెగెటివ్ నిర్ధారించడం సాధ్యం కాదని.. అక్కడ పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను ఖచ్చితంగా ఐసీఎంఆర్ నిర్ధారించిన ల్యాబుల్లోనే టెస్టు చేసి.. ఖరారు చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
అంతే కాదు.. ఇలా ఎవరికి పడితే.. వారికి టెస్టులు చేయకూడదని కేంద్రం చురకలంటించింది. వైరస్ భిన్నమైనది. మనిషి శరీరంలోకి సోకినా లక్షణాలు బయటపడటం లేదు. ఒక్కొక్కరిలో నెల రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతున్నాయి. టెస్టులు చేసినా.. మొదట్లో నెగెటివ్ అనే వస్తోంది. ఈ కారణంగా ఐసీఎంల్ ప్రత్యేకంగా కొన్ని నియమనిబంధనలు విధించింది. నిబంధనలు ఫాలో అవ్వకుండా సింపుల్‌గా షుగర్ పరీక్ష చేసినట్లుగా.. ముఖ్యమంత్రికి టెస్ట్ చేసి.. నెగెటివ్ అని ప్రకటించడంపై కంద్రప్రభుత్వం స్పందించింది. కరోనా రాపిడ్ టెస్ట్ మార్గదర్శకాల రూపొందించి విడుదల చేసింది.