English | Telugu

వేదపారాయణం చేస్తున్న పురంధేశ్వరి!

ప్ర‌ముఖ సినీ న‌టుడు, దివంగ‌త‌ మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి తండ్రి నుండి రాజకీయ వారసత్వం మే కాకుండా కృషి, కార్యదీక్ష తో పాటు ఆధ్యాత్మిక వారసత్వం కూడా తీసుకుందా అనిపిస్తున్నది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడ గలిగే పురంధ్రీశ్వరి సంస్కృతం నేర్చుకొని వేదపారాయణం కూడా చేస్తుందా అనిపిస్తుంది. ఆమె ప్రతిరోజూ ఇంట్లో దేవుని సన్నిధి లో దేవతారాధన, షోడశోపచారాలతో అర్చన, భిల్వాస్టుకం, ఆదిత్య హృదయం, త్రిశతి, ఖడ్గమాల పారాయణం చేయడం చూస్తుంటే నిజమేననిపిస్తోంది.

వేదాలతోనే సమాజం చైతన్యవంతం కాగలుగుతుందని హిందూ ధ‌ర్మ‌శాస్త్రం చెబుతోంది. భారతీయ జీవన విధానాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పేవి, సమ సమాజ నిర్మాణానికి దిశా నిర్దేశం చేసేవి నాలుగు వేదాలే. కమలం వికసించిన తీరు ఎంతగా మనలో దివ్య అనుభూతి కలిగిస్తుందో అదే అనుభూతి సామ వేదం ద్వారా మనకు లభిస్తుందట‌.

లాక్‌డౌన్ స‌మ‌యంలో బ‌య‌టికి వెళ్ళ‌కుండా ఆధ్మాత్మిక‌త పెంచుకోవ‌డ‌మే కాదు ఇంట్లోని పిల్ల‌ల‌కు వాటి యొక్క ప్రాధాన్య‌త‌ను బోధించి నేర్పించాల్సిన అవ‌స‌రం వుంది. అందుకు శ్రీమతి దగ్గుబాటి పురధరేశ్వరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.