English | Telugu

ఏపీ లో 603 కు చేరిన పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులను కలుపుకుని ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 603 కు చేరింది. కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వైయస్సార్‌ కడప, విశాఖపట్నం జిల్లాలలో 13 మంది చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 6గురు, కృష్ణా జిల్లాలో 4గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలుజిల్లాలలో ఒక్కొక్కరు.. మొత్తం 42 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో 5గురు, గుంటూరు జిల్లాలో 4గురు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.

కోవిడ్‌ –19 నివారణ చర్యలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, వినూత్న మార్కెటింగ్‌ విధానాలపై మార్కెటింగ్‌శాఖ అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. నిన్న ఒక్కరోజే ల్యాబ్‌లు, ట్రూనాట్‌ మిషన్ల ద్వారా 4వేలకు పైగా పరీక్షలు చేశామన్న అధికారులు. ర్యాపిడ్‌ పరికరాలు, స్క్రీనింగ్‌ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుందన్న అధికారులు. కోవిడ్‌ పరిస్థితులకు ముందు తిరుపతిలో ఒకటే ల్యాబ్‌.. ఆ తర్వాత వీటి సంఖ్య 7కు పెంచగలిగామన్న అధికారులు. వారం రోజుల్లో ల్యాబుల సంఖ్య 12కు పెంచుతున్నామన్న అధికారులు.