ఏప్రిల్ నేల వేతనాల్లో కూడా మార్చి నెలలానే జీతాల్లో కొత కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. పెన్షనర్లకు 75 శాతం ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు. డాక్టర్లకు, పారిశుద్ధ్యకార్మికులకు గత నెలలో ఇచ్చినట్లుగానే ఈ నెల కూడా ప్రోత్సహాకాలు ఇవ్వడంతో పాటు పోలీసులకు కూడా 10 శాతం సి.ఎం. గిఫ్ట్‌గా ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అద్దెకు ఉండే వారి వద్ద నుంచి మార్చి, ఏప్రిల్, మే ఈ మూడు నెలల అద్దెలను వసూలు చేయవద్దు. ఆ తరువాత నెలల్లో వాయిదా పద్దతిలో వసూలు చేసుకోమని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెనాల్టీ లేకుండా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది. ప్రైవేట్ విద్యాసంస్థలు ఒక్క పైసా ఫీజు కూడా పెంచడానికి వీలులేదని, నెల వారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోమని ముఖమంత్రి ఆదేశించారు. స్కూల్ యాజమాన్యాలు అతిగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సి.ఎం. హెచ్చరించారు. తెల్లరేషన్ కార్డు హోల్డర్లకు మళ్లీ మరోసారి 12 కేజీల బియ్యంతో పాటు 1500 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.