English | Telugu

ఏపీ లో ఎక్కడి ప్రభుత్వ ఉద్యోగులు అక్కడే!

విజయవాడలో నివసిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు పనిచేస్తున్న చోటే ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాఖాపరమైన ఉత్తర్వులు జరీ చేసింది. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. బయటి ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులకు ఆంక్షలు విధించింది. పనిచేసే ప్రాంతాల్లోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాలని, సోమవారం నుండి నగరంలోకి అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 3వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.