English | Telugu

రేపే ఏపీ ఇంటర్‌ ఫలితాలు

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షల ఫలితాలను విడుదల చేసిన తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు, ఇంప్రూవ్ మెంట్ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం.