English | Telugu
డాక్టర్ ను హాజరుపరచండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
Updated : May 19, 2020
డాక్టర్ సుధాకర్ ను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డాక్టర్‌ను కలుసుకునేందుకు ఆయన తల్లికి కూడా అవకాశం ఇవ్వలేదంటూ వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ పోలీసులు డాక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ పోలీసు కమిషనర్‌లను పేర్కొన్నారు.