English | Telugu

టీటీడీ ఉద్యోగాల్లో చిత్తూరు జిల్లా వాసులకే ప్రాధాన్యత...

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ కు ఆమోదం తెలిపింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఈ రిజర్వేషన్ వర్తించనుంది. టిటిడి పాలక మండలి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతికి పంపారు. దీనికి సంబందించి ప్రతిపాదనను టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడైనటువంటి కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు. గతంలో చేసిన తరహాలోనే టీటీడీ ఉద్యోగుల నియామక ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ 2007లో టీటీడీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి నిబందనలు రావడంతో రాష్ట్రమంతా ఒక యూనిట్ గా తీసుకుంటూ ఉద్యోగాల భర్తీ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 2009 లో టీటీడీ దాదాపు 2,800 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది. కానీ 2010లో 450 పోస్ట్లు మాత్రమే భర్తీ చేశారు.అప్పట్లో రిజర్వేషన్ ల పై వివాదం తలెత్తడంతో అటు తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. చిత్తూరు జిల్లా వాసులకు ఈ నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్ కిందున్నటువంటి ప్రక్రియను మాత్రం పక్కన పెట్టి పోస్టులకు నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.దాదాపు 340 పోస్టులు భర్తీ కూడా పాలక మండలి ఆమోదించిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి ఆమోదం రాగానే వీటికి సంబంధించినటువంటి తీర్మానం వెలువడే అవకాశం ఉంది.