English | Telugu

అయోధ్య ట్రస్ట్ మెంబర్లుగా మోడీ, అమిత్ షా, ఆదిత్యనాథ్!!

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు నవమి రోజున మొదలు కానున్నాయి. ఏప్రిల్ 2న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని శ్రీ రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ తెలిపింది. అయోధ్య ట్రస్టులో మెంబర్లుగా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ ఉండాలని కోరుతున్నారు న్యాస్ సభ్యులు.మూడు నెలల్లో ట్రస్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించడంతో ట్రస్టు ఏర్పాటు చేసిన వెంటనే ఈ నిర్ణయాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది.

ఆలయ నిర్మాణానికి సంబంధించిన 70% రా మెటీరియల్ సిద్ధంగా ఉందని తెలిపింది. శిలాన్యాస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ స్థంభాలు శిల్పాల పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు ట్రస్టు సభ్యులు.కొత్తగా ఏర్పాటు చేయబోయే అయోధ్య ట్రస్ట్ లో మెంబర్లుగా ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లుండాలని న్యాస్ సభ్యుల కోరుతున్నారు.

వీరు ట్రస్టు లో ఉంటే ఆలయ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని తమ విశ్వాసాన్ని తెలిపారు. దీని పై అయోధ్యలో ఒక ప్రాంతంలో స్వామీజీలు ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం.అందరికీ ఆమోదయోగ్యంతో మనోభావాలు విశ్వాసాలకు తగ్గట్లుగా ఆలయ నిర్మాణం సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అవసరమైతే శ్రీరామ నవమికి ముందే ఆలయ నిర్మాణ పనులను చేపట్టాలని కొందరు అన్నట్లు తెలుస్తుంది. నిన్న టెంపుల్ సిటీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చాలా మార్గాల్లో ఆంక్షలను సడలించడంతో సంతోషం వ్యక్తం చేశారు భక్తులు.

అయోధ్య రాముడి దర్శనానికి సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుప్రీం తీర్పు తరువాత మొదటి సారి సిటీ ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వాహనాలను అనుమతించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. సరయూ నది ఒడ్డున పుణ్యస్నానాలాచరించి రామచంద్రుని దర్శించుకున్నారు.