English | Telugu
9 మందిని ఇదే విధంగా రేప్ చేసి చంపేసిన దిశా నిందితులు!!
Updated : Dec 18, 2019
దిశా కేసు నిందితుల గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితులు గతంలో తొమ్మిది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. నిందితుల డీఎన్ఏ తో మిస్టరీ కేసులను చేధించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఆరిఫ్ అలీ, చెన్న కేశవులు హత్యలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.
ముఖ్యంగా మహబూబ్ నగర్,రంగారెడ్డి, కర్ణాటక ,హైదరాబాద్ హైవేల పై జరిగిన దారుణాల పై ఫోకస్ పెట్టారు పోలీసులు. లైంగిక దాడి చేసిన తరువాత వారిని హత్య చేసి పారిపోయినట్లు అనుమనిస్తున్నారు. ఈ విధంగా పదిహేను మృతదేహాలను గుర్తించారు పోలీసులు. ఈ పదిహేను మోడల్ కేసులోని డీఎన్ఏ రిపోర్టులు కూడా పరిశీలిస్తున్నారు.దిశా హత్య కేసులో చార్జిషీట్ వేయటానికి కంటే ముందుగానే ఈ పదిహేను కేసులను ఛేదించాలనేది పోలీసులే టార్గెట్గా కనిపిస్తుంది. వాస్తవానికి చటాన్ పల్లి ఎన్ కౌంటర్ సమయంలో ఇతర కేసుల్లో నిందితుల పాత్ర పై సీపీ సజ్జనార్ అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటకలో జరిగిన ఈ తరహా ఘటనల్లో వీరి పాత్ర పై దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. దీనికి తోడు ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితులు ఆరీఫ్, చెన్నకేశవులు నవీన్ శివా డీఎన్ఏలు ఆయా హత్య కేసులతో మ్యాచ్ అవుతున్నట్టుగా నిర్థారించారు. అందుకే నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ బృందాలు ఆ హత్య కేసులో నిందితుల పాత్ర పై ఆరా తీయబోతున్నట్లు సమాచారం. ఇక నిందితుల పూర్తి వివరాలు వారి గురించి అసలు విషయాలను పోలీసులు చేదించే పనిలో పడ్డారు.