సెల్ఫీ వీడియో లో నోరు జారినందుకు నగరి మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
సెల్ఫీ వీడియో లో నోరు జారినందుకు నగరి మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
Updated : Apr 10, 2020
కరోనా విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాస్కులకు కూడా నిధులు లేవని కమిషనర్ కె వెంకటరామి రెడ్డి సెల్ఫీవీడియో ద్వారా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నగరి కమిషనర్ కామెంట్లను సీరియస్‍గా తీసుకున్న ఏపీ సర్కార్ , సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్దంగా కమిషనర్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది, ముందస్తు అనుమతి లేకుండా నగరి దాటి వెళ్లొద్దని స్పష్టం చేసింది. నగరి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‍గా సీహెచ్ వెంకటేశ్వరరావు ను నియమించింది.