English | Telugu

లక్ష కు పైగా ఐసోలేషన్ బెడ్స్ రెడీ: లవ్ అగర్వాల్

దేశవ్యాప్తంగా 7447 కేసులు నమోదయ్యాయని, 239 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 6,565 యాక్టివ్ కేసులకుగాను , 643 మంది కోలుకున్నారని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 1,035 కొత్త కరోనా కేసులు నమోద, 40 మంది మృతి చెందారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌-19 ఆస్పత్రులు ఏర్పాటు చేశామన్నారు. లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని, కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. భారత్ లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవన్నారు.