English | Telugu
జంట నగరాలను భయపెడుతున్న డెంగ్యూ జ్వరాలు...
Updated : Oct 23, 2019
డెంగ్యూ జ్వరాల ప్రభావంతో ఆసుపత్రుల దగ్గర ప్రజలు బారులు తీరుతున్నారు. చాలా మంది చిన్న పిల్లలతో వచ్చి ఆసుపత్రి దగ్గర క్యూ కడుతున్నారు. కేవలం హైదరాబాద్ లోని జంట నగరాలలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన సంఖ్య రెండు వేల పది డెంగ్యూ కేసులు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా మరిన్ని కేసులు ఉండే అవకాశం ఉండటంతో అప్రమత్తమయిన వైద్య బృందం పూర్తిస్థాయిలో మెడిసిన్స్ ని అందుబాటులో ఉంచారు. అలాగే డాక్టర్ లను కూడా వేరే హాస్పటల్స్ నుంచి ఫీవర్ హాస్పిటల్స్ కి డిప్యుటేషన్ మీద పిలిపించుకుని ట్రీట్మెంట్స్ అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా పూర్తి స్థాయిలో అందరూ రోగాల బారిన పడుతున్న వాళ్లు అలాగే డెంగ్యూ కేసులతో పాటు మలేరియా కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. డాక్టర్స్ మరియు మెడికల్ సిబ్బంది చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరముంది అని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు పగలు కుట్టే టైగర్ దోమ నుండి చాలా ప్రివెంటివ్ గా ఉండాలి అని చెప్పి సూచిస్తున్నారు.
కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ విధంగా ఉంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అని డి.ఎం అండ్ హెచ్.ఒ విభాగం కూడా తెలియజేసింది. తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం హైజీన్ లోపం వల్ల కూడా డెంగ్యూ ఎక్కువగా ప్రభలుతోందని అధికారులు అంటున్నారు.