English | Telugu
యుగాంతం కాబోతోందా? కొన్ని గంటలే బతుకుతామా? ఆరు గ్రహాల కలయిక ప్రళయమేనా?
Updated : Dec 24, 2019
డిసెంబర్ 25... సాయంత్రం 4గంటల 41నిమిషాలకు ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. విశ్వంలో మరో విశేషాన్ని గ్రహాలు ఆవిష్కరించబోతున్నాయ్. ఆరు గ్రహాలు ఒకేరాశిలో కలబోతున్నాయ్. ఇది డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 27 రాత్రి 11గంటల 40 నిమిషాల వరకు కొనసాగనుంది. షష్టి గ్రహ కూటమిగా దీన్ని పిలుస్తున్నారు. అయితే, ఇలాంటి అద్భుతం వందేళ్ల క్రితం ఏర్పడిందని కొందరు చెబుతుంటే, కాదుకాదు 297ఏళ్ల క్రితం ఇలా కనిపించిందంటున్నారు ఇంకొందరు. అసలు ఇలాంటిది గతంలో ఎన్నడూ ఏర్పడలేదని మరికొందరు చెబుతున్నారు. అయితే, ఏదో జరగబోతున్నదనే ప్రచారం మాత్రం పెద్దఎత్తున జరుగుతోంది. ఎందుకంటే, ఒకేసారి ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలుస్తుండటంతో అరుదైన విశేషమే అయినా... ఏవైనా దుష్పరిణామాలు జరుగుతాయేమోనని భయపడుతున్నారు.
వాస్తవానికి గోచారంలో పంచ గ్రహకూటమి కానీ... షష్టగ్రహ కూటమి కానీ... లేదా సప్త గ్రహ, అష్ట గ్రహకూటమి జరిగినప్పుడు ఫలితం ఏవిధంగా ఉంటుదో కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, దాంతో అంచనా వేయడం కష్టమంటున్నారు. అందులోనూ గోచార ఫలితాలు కేవలం 20 శాతం వరకు మాత్రమే మానవులపై ప్రభావం చూపే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఆయా రాశుల్లో జన్మించిన వారికి ఈ కూటమి ఏర్పడే స్థానాన్ని బట్టి ఫలితంలో మార్పు ఉంటుందే తప్ప అన్ని రాశుల వారికి చెడు ఫలితం ఇస్తుందనుకోవటం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఈ ఫలితాలు ఏవైనా కూడా అవి కొత్తగా వచ్చేవి కాదు. ఎందుకంటే అంతకు పది రోజుల ముందు సూర్యుడు, 50 రోజులకు ముందు గురువు ధనుస్సులోకి వచ్చి వాటి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినందున... ఈ కూటమి వలన కొత్తగా జరిగే చెడు గానీ, మంచిగానీ ఏదైనా నామమాత్రంగానే ఉంటుందని అంటున్నారు.
ఖగోళంలో మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నామని ఖగోళ శాస్త్రవేత్తలు అంటుంటే... పండితులు మాత్రం ప్రళయం తప్పదని అంటున్నారు. మరికొందరైతే యుగాంతం ఖాయమంటున్నారు. కొన్ని గంటలే మన బతుకుతామనే మాటలు చెబుతున్నారు. షష్టగ్రహ కూటమి ప్రకృతి ఒడిలో చిచ్చు పెట్టబోతోందని అంచనా వేస్తున్నారు. గ్రహాల కలయిక జరిగిన కొన్ని గంటల్లోనే సూర్యగ్రహణం కూడా ఉండటంతో డిసెంబర్ 25న అసలేం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.